SMC చైర్ పర్సన్ కొడుకు / కూతురు TC తీసుకున్న మరుక్షణమే ఆయన పదవి పోతుంది. SMC వైస్ చైర్ పర్సనే తిరిగి ఎన్నికలు జరిగేంత వరకు చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. అతడికి చెక్ పై సంతకం పెట్టే అధికారంతో పాటు అన్ని అధికారాలూ ఉంటాయి.

స్కూల్లో చైర్ పర్సన్ కూతురు టెన్త్ క్లాసుకు వచ్చింది అనుకుంటే GO Ms No 41, Dated:19-06-2013 పేరా 4 Rule 19 (ii) (a) (2) ప్రకారం ఎంపికైన  SMC సభ్యుల పదవీకాలం రెండేళ్లు లేదా కూతురు / కొడుకు స్కూలు వదిలి వెళ్లే వరకు (ఏది ముందైతే అది).  SMC చైర్ పర్సన్ కూతురు టెన్త్ క్లాసుకు వచ్చిందే తప్ప స్కూలు వదిలి వెళ్ళలేదు. కాబట్టి, SMC చైర్ పర్సన్ కూతురు టెన్త్ క్లాసుకు వచ్చినాఆయనే / ఆమే చైర్ పర్సన్ గా కొనసాగుతారు.

SMC చైర్ పర్సన్ కూతురు / కొడుకు TC తీసుకోకుండా ప్రైవేట్ స్కూలుకు వెళ్తుంటే ఎన్ని రోజులు నుండి పాఠశాలకు రావడంలేదో చూసి పేరు తొలగించాలి. ( TSER Rule-45 ప్రకారం 30 రోజులు వరుసగా పాఠశాలకు రాని విద్యార్థుల పేర్లు  హాజరు పట్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది ). తల్లిదండ్రులకు లిఖితపూర్వకంగా నోటీసుఇచ్చి పేరు తొలగించడం మంచి ప్రయత్నం.

పూర్తి వివరములు కొరకు

GO.NO. 41 Dt 19-06-2013  The Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rules, 2010 – Amendment – Orders – Issued.